గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడండి: హరీశ్ రావు
TG: BC రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్, BJP గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 'కేంద్రంలో BJP, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలు మద్దతిచ్చాక రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా BC రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా BRS మద్దతు ఉంటుంది' అని ట్వీట్
చేశారు.

Comments