నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి (లేటరల్ ఎంట్రీ) అప్లికేషన్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23తో గడువు ముగియగా, తాజాగా పొడిగించారు.విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి, మే 1, 2011 నుంచి జులై 31, 2013 మధ్య జన్మించి ఉండాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రవేశ పరీక్ష
ఉంటుంది.వెబ్సైట్: https://navodaya.gov.in

Comments