తిరుమల: 16 కంపార్టుమెంట్లలో భక్తులు

తిరుమల: 16 కంపార్టుమెంట్లలో భక్తులు
AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు
లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 16 గంటల.సమయం పడుతుందని TTD అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 16 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గురువారం 67,388 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 21,997 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.1.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Comments